Monday, January 13, 2025

రేవతి మృతితో మాకు సంబంధం లేదు: సంధ్య థియేటర్ యజమాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేవతి మృతితో తమకు సంబంధం లేదని హైకోర్టులో సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ పిటిషన్ దాఖలు చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చిందని కోర్టుకు తెలిపింది. పైగా ప్రీమియర్ షో తాము నిర్వహించలేదని, ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారని, ఐనా తాము బాధ్యతగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాంటి తమపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఆర్ టిసి క్రాస్ రోడ్డులో సంధ్య థియేటర్ లో పుష్ప 2 విడుదల సందర్భంగా హీరో అల్లు అర్జున్ అక్కడికి రావడంతో తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News