Wednesday, December 25, 2024

ఆరోజు థియేటర్ లోపల ఏం జరిగిందో నాకు తెలియదు: రేవతి భర్త

- Advertisement -
- Advertisement -

తొక్కిసలాట జరిగిన రోజున సంధ్య థియేటర్ లోపల ఏం జరిగిందో తనకు తెలియదని, కానీ తమకు ప్రభుత్వం నుంచి, అల్లు అర్జున్ నుంచి సంపూర్ణ మద్దతు ఉందని ఈ ఘటనలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ తెలిపారు. తన కొడుకు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటున్నాడన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజకు చికిత్సను కొనసాగిస్తామని ఆసుపత్రి వైద్యులు చెప్పారన్నారు. తన కొడుకు కోలుకుంటున్నాడని, బాడీ స్పందిస్తోందన్నారు. కళ్లు తెరిచి చూస్తున్నాడని, కానీ తమను ఇంకా గుర్తించడం లేదని తెలిపారు. అయితే శ్రీతేజ్ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని వైద్యులు చెప్పారన్నారు.

అల్లు అర్జున్ మేనేజర్లు ప్రతి రోజూ శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నట్లు చెప్పారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన రోజునే కేసును వాపసు తీసుకుంటామని చెప్పామని భాస్కర్ గుర్తు చేశారు. థియేటర్ వద్ద రద్దీ కారణంగా తాను, తన భార్య రేవతి, కొడుకు శ్రీతేజ్ విడిపోయామన్నారు. థియేటర్ లోపల ఏం జరిగిందో మాత్రం తనకు తెలియదన్నారు. తమకు అందరి నుంచి సహకారం లభిస్తోందని భాస్కర్ అన్నారు. మైత్రీ మూవీస్ సంస్థ రూ.50 లక్షలు ఇచ్చిందని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రతీక్ ఫౌండేషన్ నుంచి రూ.25 లక్షలు ఇచ్చారని తెలిపారు. అల్లు అర్జున్ రూ.10 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. సినీ పరిశ్రమ, అల్లు అర్జున్ నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News