Wednesday, January 22, 2025

సందులో సంబరాల శ్యాంబాబు సినిమా ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడితే వైసిపి నేత, మంత్రి అంబటి రాంబాబు పరిస్థితి అథోగతేనని జనసేన నేత కిరణ్ రాయల్ ఘాటుగా విమర్శించారు. తిరుపతిలో ఎస్‌ఎస్‌ఎస్ చిత్రానికి జనసేన నేతలు ప్రారంభోత్సవం చేశారు. సందులో సంబరాల శ్యాంబాబు(ఎస్‌ఎస్‌ఎస్)కు జనసేన నేత కిరణ్ రాయల్ క్లాప్ కొట్టారు. తన మంత్రిత్వశాఖపై పట్టులేని వ్యక్తి అంబటి అని ఎద్దేవా చేశారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే అంబటి ఇంటిని ముట్టడించడంతో పాటు ఆయన పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సినిమాల గురించి చెప్పడం మాని తన శాఖపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు మేలు చేసే బుద్ధిని అంబటికి ఆ దేవుడు ప్రసాదించాలన్నారు.

Also Read: మనిషిని పోలిన ఎలుగుబంటి(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News