Friday, December 20, 2024

పేకాటలో రూ.300 కోసం చంపేశారు…

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: పేకాటలో మూడు వందల రూపాయల కోసం యువకుడిని నలుగురు పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలోని రంజిత్ నగర్‌లో జరిగింది. నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రమోద్, రాజ్నిష్, అమిత్ కుమార్, రోషన్ సింగ్, అభిషేక్ అనే యువకులు పేకాట ఆడేవారు. ప్రమోద్‌తో పేకాట ఆడుతుండగా అభిషేక్ మూడు వందల రూపాయలు కోల్పోయాడు.

Also Read: హనుమకొండలో విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం…

దీంతో తన మూడు వందల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. అభిషేక్ మూడు వందల రూపాయలు తీసుకొని వెళ్తుండగా ప్రమోద్ తన స్నేహితుల రోషల్, అమిత్, రజ్నిష్‌తో కలిసి అనుసరించారు. సంగమ్ కాలనీలో కొంచెం దూరం వెళ్లిన అభిషేక్ పట్టుకున్నారు. ప్రమోద్ కత్తి తీసుకొని అభిషేక్ కడుపులో పొడిచాడు. స్థానికుల సమాచారం పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News