Friday, February 21, 2025

సంగం నీళ్లు తాగడానికి అనుకూలమే : యోగి ఆదిత్యనాథ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద నది నీటిలో మల విసర్జనాల సంబంధ కోలీఫామ్ బ్యాక్టీరియా సాధారణ స్థాయి కంటే అత్యధికంగా ఉందని , స్నానం చేయడానికి తగిన ప్రమాణాలకు అనుగుణంగా నీరు లేదని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది. దీనిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. సంగమం వద్ద నది నీళ్లు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. సనాతన ధర్మం, గంగామాత, భారత్ గురించి తప్పుడు ప్రచారం చేస్తే , 56 కోట్ల మంది విశ్వాసంతో ఆడుకున్నట్టే అని అన్నారు. యూపీ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 56.25 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.

మహా కుంభమేళాలో గత నెలలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది , ప్రయాగ్ రాజ్ వెళ్లే భక్తుల రద్దీ కారణంగా ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన సంగతి తెలిసిందే. వీటిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహాకుంభ్ మృత్యుకుంభ్ అని విమర్శించారు. దీనిపై యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ “ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై రాజకీయాలు చేయడం ఎంతవరకు సముచితం . తొలిరోజు నుంచి మహాకుంభ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ శతాబ్దంలో జరుగుతోన్న కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది. అందుకే తప్పుడు ప్రచారాలు పట్టించుకోకుండా ఈ ప్రపంచం, ఈ దేశం పాల్గొంటోంది ” అని యోగి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News