Friday, December 20, 2024

సిఎం కెసిఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన సంగారెడ్డి కలెక్టర్..

- Advertisement -
- Advertisement -

Sangareddy Collector Sharath praises CM KCR

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పొగడ్తలతో ముంచెత్తారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు చివరి రోజు కావడంతో జిల్లా కలెక్టరేట్ లో ఆదివారం వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ అభినవ అంబేద్కర్ అని కొనియాడారు. ”రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని చూడలేదు.. సీఎం కేసీఆర్ రూపంలో ఇప్పుడు చూస్తున్నాం. ఆనాడు అంబేద్కర్ అట్టడుగు వర్ణాల అభ్యున్నతి కోసం అన్ని అంశాలు పొందుపరిచి రాజ్యాంగాన్ని నిర్మించారు. అంబేద్కర్ స్ఫూర్తితో సిఎం కెసిఆర్ అట్టడుగు వర్ణాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు పొందుపరిచారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించడంపై సంతోషంగా ఉంది. దేశ చరిత్రలో ఒక సంచలమైన నిర్ణయం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని సంచలన నిర్ణయం తీసుకున్నారు. గిరిజనుల పట్ల సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

Sangareddy Collector Sharath praises CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News