Tuesday, January 21, 2025

వేర్వేరు ఘటనలో చెరువులో పడి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: వేర్వేరు ఘటనలో చెరువులో పడి ఒకరు మృతి చెందగా ఇద్దరు గల్లంతయ్యారు. మరో ఇద్దరిని పోలీసులు రక్షించారు. నల్లగొండ జిల్లా చందనపల్లి చెరువులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యంకాగా మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుడి కోసం అగ్నిమాపక సిబ్బంది పోలీసులు గాలిస్తున్నారు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు యువకులు చెరువులో పడినట్టు సమాచారం.

సంగారెడ్డి జిల్లాలో అమీన్‌పూర్ పెద్ద చెరువులో ఇద్దరు పిల్లలతో తల్లి దూకింది. దంపతుల మధ్య గొడవ జరగడంతో అర్థరాత్రి పిల్లలతో ఇంట్లో నుంచి తల్లి వెళ్లిపోయింది. శ్వేత తన పిల్లలు శ్రీహా, శ్రీహాన్స్‌తో కలిసి పెద్ద చెరువులో దూకింది. తల్లి శ్వేత, చిన్నారి శ్రీహాను అమీన్‌పూర్ పెట్రోలింగ్ పోలీసులు రక్షించారు. చెరువులో మునిగిన శ్రీహాన్స్ కోసం సిబ్బంది గాలిస్తున్నారు. అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News