Sunday, December 22, 2024

లారీని ఢీకొట్టిన బైక్: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా కంది మండలంలో తునికిళ్ల తండా సమీపంలో గురువారం ఉదయం ఆగి ఉన్న లారిని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. మృతులు పుల్కల్ మండలం ఇసాజిపేట, గంగోజి పేటకు చెందిన అభిషేక్, సందీప్, నవీన్‌గా గుర్తించారు. కంది అక్షయపాత్ర కిచెన్‌లో పనిచేసేందుకు వారు వెళ్తండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News