Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో లారీ-కారు దగ్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. అతివేగంతో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. బొగ్గు లారీ కావడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే లారీ కూడా పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. అతిగేవగంతోనే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News