- Advertisement -
సంగారెడ్డి: తనయుడిని భర్త ఎత్తుకోలేదని భార్య తన కుమారుడితో కలిసి అదృశ్యమైన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఇస్నాపూర్ వడ్డెరకాలనీలో సాయికుమార్, లక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు 11 నెలల బాబు ప్రణయ్ ఉన్నాడు. శుక్రవారం ఉదయం భర్త, కుమారుడితో కలిసి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. అంగన్‌వాడీ కేంద్రంలో కుమారుడిని ఎత్తుకోవాల్సిందిగా భర్తను భార్య కోరింది. అతడు నిరాకరించడంతో ప్రణయ్‌తో కలిసి లక్ష్మి ఇంటికి వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం భార్య, కుమారుడు కనిపించకపోవడంతో గ్రామంలో భర్త తన కుటుంబ సభ్యులతో కలిసి వెతికాడు. భార్య కనిపించకపోవడంతో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
- Advertisement -