Saturday, April 5, 2025

జహీరాబాద్ లో కంటైనర్ లో మంటలు… కాలిపోయిన కార్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌లో కార్లను తరలిస్తుండగా వాహనంలో భారీగా మంటలు చేలరేగాయి. వెంటనే కంటైనర్ డ్రైవర్ సమాచారం మేరకు జహీరాబాద్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. అప్పటికే కార్లు, కటైనర్ పూర్తిగా కాలిపోయాయి. కార్లను మంబయి నుంచి హైదరాబాద్ రవాణా చేస్తుండగా రంజోల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముంబయి జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. వాహనాలు రెండు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News