Wednesday, January 22, 2025

సంగారెడ్డి ఐఐటిలో విద్యార్థి అదృశ్యం

- Advertisement -
- Advertisement -
  • కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు
  • విశాఖ వెళ్లిన పోలీసులు

సంగారెడ్డి: ఐఐటి హైదరాబాద్‌లో బిటెక్ సెకండీయర్ చదువుతున్న కార్తీక్ (21) మిస్సింగ్ మిస్టరీగా మారింది. సంగారెడ్డి రూరల్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం 17న ఐఐటి క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి తిరిగి క్యాంపస్‌కు చేరుకోలేదు. మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తాండాకు చెందిన సంగారెడ్డి కార్తీక్ ఐఐటిలో చదువుతున్నాడు. 18న కార్తీక్‌కు తల్దిండ్రులు ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో 19న కార్తీక్ తల్లిదండ్రులు ఐఐటి క్యాంపస్‌కు వచ్చారు. కార్తీక్ క్యాంపస్‌లో లేక పోవడంతో ఆందోళనకు గురైన తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా విశాఖ పట్నం వెళ్లినట్లు గుర్తించి సంగారెడ్డి రూరల్ పోలీసులు తల్లిందుండ్రలు విశాఖ పట్నం వెళ్లి గాలిస్తున్నారు. పోలీసులకు కార్తీక్ సమాచారం కొంత లభించిందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News