Friday, December 20, 2024

రోడ్డు పక్కన గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా కొల్లూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రొడ్డు పక్కన గుడిసెలోకి లారీ దూసుకెళ్లింది. ఔటర్ రిండ్ రోడ్డు పక్కన చెట్లకు నీళ్లు పోసే కార్మికులను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. మృతులు బాబు రాథోడ్(48), కమలీబాయ్(43), రాథోడ్(23)గా గుర్తించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ఘటన జరిగింది. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News