Saturday, December 21, 2024

పటాన్‌చెరులో రూ. 66.75 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: పెట్టుబడుల పేరిట పటాన్‌చెరులో ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు. ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ. 66.75 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మన ఫోన్‌కు వచ్చి ఓటిపి నెంబర్‌ను ఎవరితో పంచుకోవద్దని తెలిపారు. బ్యాంకు వాళ్లు ఫోన్ చేసి ఎటువంటి సమాచారాన్ని కస్టమర్‌ను అడగరని గుర్తుంచుకోవాలని పోలీసులు వివరించారు. డబ్బులు పోయిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News