Wednesday, January 22, 2025

సంగారెడ్డి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -
  • మంత్రి హరీశ్‌రావును కోరిన డాక్టర్ శ్రీహరి

సంగారెడ్డి: బిఆర్‌ఎస్‌లో చాలా ఏళ్లుగా ఉన్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ టికెట్ తనకు కేటాయించాలని డాక్టర్ శ్రీహరి కోరారు. సోమవారం హైదరాబాద్‌లో సంగారెడ్డికి చెందిన బిఆర్‌ఎస్ నాయకుడు డాక్టర్ శ్రీహరి సంగారెడ్డి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతూ మంత్రి హరీశ్‌రావును కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ వివాదాలకు దూరంగా ఉన్నానని, పార్టీ ఏ కార్యాక్రమం చేపట్టిన తన వంతుగా విజయవంతానికి కృషి చేశానని తెలిపారు. వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన తనకు పార్టీ అవకాశం ఇస్తే బిఆర్‌ఎస్‌కి కూడ అన్ని విధాలుగా కలిసి వస్తుందన్నారు. ప్రస్తుతం సంగారెడ్డి నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయాల నేపథ్యంలో తనకు గుప్తింపునిస్తే ఖచ్చితంగా సీటును గెలుచుకుంటానన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వారే కాకుండా నియోజకవర్గం మొత్తం తనకు మద్దతుగా ఉందన్నారు. వైద్య వృత్తిలో తాను అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఉన్నానన్నారు. అన్ని వర్గాల వారి మద్దతును తాను కూడగట్టుకుంటారని మంచి మెజార్టీతో విజయం సాధిస్తానని మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ బాగయ్య, ప్రభుగౌడ్, శ్రీకాంత్, రవి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News