Thursday, December 19, 2024

ఫిలిప్పీన్స్‌లో సంగారెడ్డి విద్యార్ధిని అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

ఫిలిప్పీన్స్‌లో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్ధిని అనుమానాస్పద మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామపంచాయతీ నివాసి అయిన స్నిగ్ధ (17) అనే విద్యార్థిని.. ఎంబీబీఎస్ విద్య కోసం ఫిలిప్పీన్స్ వెళ్లింది. అక్కడ పర్పెక్చువల్ హెల్త్ యూనివర్సిటీ మనీలాలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న స్నిగ్ధ అనుమానాస్పదంగా చనిపోయింది.

శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్నిగ్ధ చనిపోయినట్లు తోటి విద్యార్థినిలు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీంతో స్నిగ్ధ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. స్నిగ్ధ తండ్రి అమృత్‌రావ్‌ విద్యుత్‌ శాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియారాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News