Sunday, December 22, 2024

భీమలింగం వద్ద సిఎం పూజలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: వలిగొండ మండలం సంగెం మూసీ నది ఒడ్డునున్న భీమలింగం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూజలు చేశారు. సంగెం నుంచి రేవంత్ రెడ్డి మూసీ పురుజ్జీవ యాత్ర ప్రారంభించారు.
ధర్మారెడ్డి కాలువ వెంట సంగెం నుంచి నాగిరెడ్డి పల్లి వరకు సిఎం రేవంత్ పాదయాత్ర చేసి ముగించారు.
సుమారు 2.5 కిలో మీటర్ల మేర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పలు సమస్యలను సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి సంగెం గ్రామస్థులు తీసుకొచ్చారు. మూసీ వల్ల కలిగే సమస్యలను సిఎం రేవంత్ రెడ్డికి సంగెం గ్రామస్థులు వివరించారు. మూసీ పునరుజ్జీవ యాత్రలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎంఎల్ఎ మందుల సామేల్, భువనగిరి ఎంఎల్ఎ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రముఖ రాజకీయ నాయకులు,  కాంగ్రెస్ శ్రేణులు తండోపతండాలుగా పాల్గొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News