Tuesday, April 8, 2025

ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలోకి దూసుకెళ్లిన కారు: కుమారుడు మృతి… తండ్రీ కూతురు గల్లంతు

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలో కారు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతైన సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ తన భార్య కృష్ణవేణి, కూతురు చైత్ర సాయి, కుమారుడు ఆర్యవర్థన్ సాయితో కలిసి హనుమకొండ నుంచి సొంతూరుకు కారులో వెళ్తున్నారు. మేచరాజుపల్లి గ్రామ శివారులోకి రాగానే డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్‌కు గుండెలో నొప్పి రావడంతో కారు అదుపుతప్పి ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు కృష్ణవేణిని బయటకు తీయగా కుమారుడు ఆర్యవర్థన్ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు గల్లంతయ్యారు. పోలీసులు, నీటి పారుదలు అధికారులు అక్కడికి చేరుకొని నీటి ప్రవాహాన్ని తగ్గించి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News