Sunday, December 22, 2024

ఎమర్జెన్సీకి ‘పరివార్’ మద్దతు!

- Advertisement -
- Advertisement -

ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తాము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా పని చేశామని సంఘ్‌పరివార్ చెప్పుకుంటుంది. జైళ్ళ నుంచి విడుదలవ్వడానికి వారు ఇందిరా గాంధీని సమర్థించినట్టుగా చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన గడిచిన జూన్ 25వ తేదీ నాటికి 48 ఏళ్ళు పూర్తయ్యాయి. స్వాతంత్య్రానంతర దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం అత్యం త దారుణమైన అధ్యాయమని 2014లో అధికారం చేపట్టడానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నిజానికి తొమ్మిదేళ్ళ మోడీ పాలనతో పోల్చుకుంటే 21 నెలల ఎమర్జెన్సీ కాలం దిగుదుడుపే. ఈ తొమ్మిదేళ్ళ కాలంలో పత్రికా స్వేచ్ఛపైన, మత స్వేచ్ఛపైన, భావప్రకటనా స్వేచ్ఛపైన, నిరసన తెలిపే హక్కుపైన దారుణమైన దాడి జరుగుతోంది. ప్రతి ఏడాది జూన్ 25వ తేదీని ఎమర్జెన్సీ చీకటి రోజులను గుర్తు చేస్తూ బిజెపి వార్షిక కార్యక్రమం చేపడుతోంది.

నిజమైన ప్రజాస్వామిక శక్తులు మాత్రమే ఇందిరా గాంధీ నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తారని తనను తాను పొగుడుకుంటోంది. ఎమర్జెన్సీ తప్పుడు నిర్ణయాన్ని నిజమైన ప్రజాస్వామిక శక్తులు వ్యతిరేకిస్తారు. ఆనాటి రాజకీయ, ఆర్థిక పరిస్థితులను మర్చిపోవచ్చు. ఆ దారుణాలకు రాజ్యాంగం ఎలా దుర్వినియోగం అయిందో కూడా మర్చిపోవచ్చు.అదే సమయంలో నిరంకుశ దేశాల జాబితాలో ప్రస్తుత ప్రభుత్వం అధమ స్థాయికి చేరిందనే చేదు నిజాన్ని అనేక సూచికలు తెలియచేస్తున్నాయి.భారత దేశం ఎన్నికల నియంతృత్వంలోకి దిగజారిపోయిందని ప్రపంచంలో ప్రజాస్వామిక వ్యవస్థలను అధ్యయనంచేసే స్వీడన్‌కు చెందిన వి.డ్రీవ్‌ు ప్రకటించింది. ఎమర్జెన్సీ విధించిన తరువాత ఇందిరా గాంధీని నియంత అన్న ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్ నాయకులు ఎమర్జెన్సీని సమర్థిస్తూ అదే ఇందిరా గాంధీతో రహస్య ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

చరిత్రలో ఈ ప్రజా వ్యతిరేక చర్యలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు. రహస్యంగా ఎమర్జెన్సీని సమర్థించిన సంఘ్‌పరివార్ నాయకుల చర్యలను, వారి నాయకులు రాసిన రాతలు, చారిత్రక ఆధారాలే వెల్లడిస్తున్నాయి. ఇందిరాగాంధీతో రాజీపడిపోవడానికి ప్రయత్నించడమే కాకుండా, తమ నాయకుడు వి.డి. సావర్కార్ అడుగుజాడల్లో జైలు అధికారులకు లొంగుబాటు లేఖలు రాశారు. ఎమర్జెన్సీ కాలంలో తాము భారత దేశాన్ని రక్షించామంటూ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకులు ప్రతి ఏడాది జూన్ 25వ తేదీన ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లు పెడుతున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ, మొరార్జీ దేశాయ్, ఇతర నాయకులు 1975 జూన్ 26వ తేదీన జైలుకు వెళుతున్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. ఎమర్జెన్సీలో జనసంఘ్ నాయకుల కంటే, సోషలిస్టులు, లోహియావాదులు, సిపిఎం సహా అనేక కమ్యూనిస్టు, నక్సలైట్లు గ్రూపుల నాయకులు, వేలాది మంది కార్యకర్తలు చాలా మూల్యం చెల్లించారు.

కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. అయినప్పటికీ, ఏ వాజ్‌పేయీ ఫోటోలైతే వార్త పత్రికల మొదటి పేజీలోకి ఎక్కాయో, నిజానికి ఆ వాజ్‌పేయీ జైలులో గడిపారా? ఎమర్జెన్సీని వ్యతిరేకించనని అండర్ టేకింగ్ ఇచ్చిన వాజ్‌పేయీ ఎమర్జెన్సీ 21 నెలల్లో ఎక్కువ భాగం పెరోల్‌పై ఇంట్లోనే గడిపారు. ఈ వాస్తవాన్ని కమ్యూనిస్టులు కానీ, సోషలిస్టులు కానీ బయట పెట్టలేదు. ఆ పని చేసింది బిజెపి నాయకుడు సుబ్రమణ్యస్వామి. ‘ద హిందూ’ పత్రిక 2000 జూన్ 13 వ తేదీ సంచికలో ‘ద అన్ లెర్ట్న్ లెస్సన్ ఆఫ్ ఎమర్జెన్సీ’ అన్న శీర్షికన సుబ్రమణ్యస్వామి రాసిన కథనంలో అనేక మంది ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్ నాయకులు ఇందిరా గాంధీతో జరిపిన రహస్య చర్చలను వెల్లడించారు. వాజ్‌పేయీ జైలుకు వెళ్ళిన కొద్ది రోజులకే ఇందిరా గాంధీతో ఒక ఒప్పందానికి వచ్చారు. తాను పెరోల్‌పైన విడుదలైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొననని రాసిచ్చారు. పెరోల్‌పైన జైలు బయట ఉన్న కాలంలో వాజ్‌పేయీ ప్రభుత్వానికి రాసిచ్చినట్టే వ్యవహరించారని సుబ్రమణ్యస్వామి ఆ కథనంలో రాశారు.

ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఇందిరా గాంధీకి, ఎమర్జెన్సీకి బహిరంగంగా పూర్తి మద్దతు తెలుపుతూ 1976 డిసెంబర్ నాటికి డాక్యుమెంట్లపైన సంతకాలు చేసినట్టు సుబ్రమణ్య స్వామి ఆ వ్యాసంలో రాశారు. ఎమర్జెన్సీ విధించాక ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఏక్‌నాత్ రనడే ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చాక సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు మాధవరావు మూలె ప్రభుత్వాన్ని వ్యతిరేకించకుండా తమ సంస్థ కార్యకలాపాలను కొనసాగించే బాధ్యతను చేపట్టారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాలకు అమెరికా సహా ఇతర విదేశాలలో మద్దతును కూడగట్టే పనిలో సుబ్రమణ్య స్వామి ఉన్నారు. “లొంగుబాటు డాక్యుమెంట్లను 1976 జనవరి నాటికి సమర్పించడానికి పూర్తి చేసింది” కనుక సుబ్రమణ్య స్వామి విదేశాలలో చేపట్టే కార్యకలాపాలను ఆపేయాలని మాధవరావు మూలె కోరారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల లొంగుబాటు నిర్ణయాన్ని ఆనాటి ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి టి.వి. రాజేశ్వర్ ‘ఇండియా ద కృషియల్ ఇయర్స్’ అన్న పుస్తకంలో రాశారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ సమాచార సలహాదారు హెచ్. వై శారద ప్రసాద్ కుమారుడు రావి విశ్వేశ్వర శారద ప్రసాద్ ‘ద ప్రింట్’లో రాసిన కథనంలో కూడా ఈ విషయాన్ని గుర్తు చేశారు.

సర్ సంఘ్ సంచాలక్ లొంగుబాటు లేఖలు
ఆర్‌ఎస్‌ఎస్ అధినేత, సర్‌సంఘ్ సంచాలక్ బాలాసాహెబ్ దేవరస్ ఎరవాడ జైలు నుంచి ఇందిరా గాంధీకి లేఖలు రాశారు. తన విడుదలకు ఇందిరాగాంధీపైన ఒత్తిడి తేవాలని వినోభాబావేకి కూడా ఆయన లేఖ రాశారు. ఎమర్జెన్సీలో ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్ నాయకుల చర్యలను, కపటత్వాన్ని ఈ లేఖలు బయటపెడతాయి. బాలాసాహెబ్ దేవరస్ హిందీలో రాసిన ‘హిందూ సంఘటన్ ఔర్ సత్వాది రాజనీతి’ అనే పుస్తకంలో ఈ లేఖలను అనుబంధంగా పొందుపరిచారు. మేధావి, రాజకీయ కార్యకర్త యోగేంద్రయాదవ్ తన ట్వీటర్‌లో ఈ పుస్తకం లింక్‌ను పెట్టారు. నాటి భారతీయ లోక్‌దళ్ నాయకుడు బ్రహ్మ దత్ రాసిన ‘ఫైవ్ హెడెడ్ మాన్‌స్టర్: ఎ ఫ్యాక్చ్యువల్ నేటివ్ ఆఫ్ ది జెనిసిస్ ఆఫ్ జనతా పార్టీ’ అన్న పుస్తకంలో ఈ లేఖల ఆంగ్ల అనువాదాన్ని చూడవచ్చు.

ప్రతిన్వా అనిల్, క్రిస్టిఫర్ జఫ్రిలాట్‌లు సంయుక్తంగా రాసిన ‘ఇండియాస్ ఫస్ట్ డిక్టేటర్ షిప్’ అన్న పుస్తకంలో కూడా ఈ లేఖలు అందుబాటులో ఉన్నాయి. ఇందిరా గాంధీ 1975 జూన్ 25వ తేదీన ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించే దేశద్రోహుల నుంచి దేశాన్ని రక్షించడానికి ఇది చాలా అవసరమని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ ఇందిరా గాంధీ ప్రకటించారు. ఆమె నియంతృత్వాన్ని దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులు ఖండించాయి. ఇందిరా గాంధీ చేసిన ఈ ప్రసంగాన్ని బాలాసాహెబ్ దేవరస్ 1975 ఆగస్ట్ 22 వతేదీన రాసిన లేఖలో కీర్తించారు.

సమయానుకూలంగా సమతౌల్యతతో ఉన్నదని పొగిడారు. ఆర్‌ఎస్‌ఎస్ హిందువుల కోసమే పని చేసే సంస్థ అని, అది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ఆర్‌ఎస్‌ఎస్‌పైన ఉన్న దురవగాహనను పారదోలడానికి లేఖలు రాశానని వేవరస్ పేర్కొన్నారు. “దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్‌ఎస్‌ఎస్‌పైన ఉన్న నిషేధాన్ని తొలగించాలని, ఇది తగదని మీరు భావిస్తే, మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది” అని రాశారు. తొలి లేఖలో ఎమర్జెన్సీ విధించడానికి తన ఆమోదాన్ని తెలుపుతూ, ఎమర్జెన్సీని కాకుండా ఆర్‌ఎస్‌ఎస్‌పైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. బాలాసాహెబ్ దేవరస్ లేఖలకు ఇందిరాగాంధీ ఏమాత్రం స్పందించలేదు.

అదే సమయంలో మీడియాను లొంగిపొమ్మంటే వారామె దగ్గరకు పాక్కుంటూ వెళ్ళారు. ఆమె చేసిన దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు అయిగురు సభ్యుల ధర్మాసనం కొట్టేసింది. నియంతృత్వం పొడిగింపును సమర%

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News