Monday, December 23, 2024

ప్రీ క్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ

- Advertisement -
- Advertisement -

Sania and Kristen progress to Indian Wells pre-quarterfinals

 

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్), క్రిస్టెన్ ఫ్లిప్‌కెన్స్ (బెల్జియం) జంట ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్‌లో సానియా జోడీ 63, 36, 107 తేడాతో షుకో (జపాన్)అలెగ్జాండ్రా క్రూనిక్ (సెర్బియా) జంటను ఓడించింది. ఆరంభ సెట్‌లో సానియా జోడీ ఆధిపత్యం చెలాయించింది. దూకుడుగా ఆడుతూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. కానీ రెండో సెంట్‌లో సానియా జంటకు చుక్కెదురైంది. ఈసారి ప్రత్యర్థి జోడీ విజయం సాధించింది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. ఇందులో చివరి సానియా జంటకు విజయం వరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News