Monday, December 23, 2024

ఆర్‌సిబి మెంటార్‌గా సానియామీర్జా..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భారత మహిళా టెన్నిస్ స్టార్ సానీయా మీర్జా అవతారంలో కనిపించనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మెంటార్‌గా వ్యవహరించనుంది. మహిళల టి20 లీగ్ వచ్చే నెల 4నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత టెన్నిస్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సానీయా ఇక నుంచి క్రికెట్‌లోనూ కీలకపాత్ర పోషించనుంది. సానియా మీర్జాను మెంటార్‌గా ఆర్సీబీ ట్విట్టర్ వేదికగా బుధవారం ప్రకటించింది. ఆర్సీబీ మహిళా జట్టుకు సానియాను మెంటార్‌గా నియమించడం సంతోషంగా ఉందని ఫ్రాంచైజీ ఉపాధ్యక్షుడు వి మేనన్ తెలిపారు.

క్రీడారంగంలో సానియా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని టెన్నిస్ తారగా ఎదిగిందని, యువతరానికి మార్గదర్శిగా నిలిచిందని మేనన్ అన్నారు. కాగా ఆర్సీబీ మహిళా జట్టుకు మెంటార్‌గా నియమించడంపై సానీయా మీర్జా సంతోషం వ్యక్తం చేసింది. డబ్లూపిఎల్ వల్ల మహిళల క్రికెట్ ఉన్నత శిఖరాలకు చేరుతుందని విశ్వసిస్తున్నట్లు సానియా తెలిపింది. మెగాలీగ్‌లతో యువతరం క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి మార్గం సుగమం అవుతుందని సానియా తెలిపింది. కాగా ఇటీవల సానీయా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించింది. కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెరుగైన ప్రదర్శనతో నిష్క్రమించింది. కాగా ఆర్సీబీ జట్టు మార్చి ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆరంభ మ్యాచ్ ఆడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News