Wednesday, January 22, 2025

షోయబ్ మాలిక్ మరో పెళ్లి..

- Advertisement -
- Advertisement -

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నట్టు షోయబ్ మాలిక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అంతేగాక సనాతో వివాహానికి సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు. షోయబ్‌కు ఇంతకుముందు భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. కొంతకాలంగా షోయబ్, సానియాలు విడివిడిగా ఉంటున్నారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటారనే వార్తలు అప్పట్లో హల్‌చల్ చేశాయి. అయితే ఇటు సానియా కానీ అటు షోయబ్ కానీ విడాకులకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ కొన్ని రోజుల క్రితం సానియా మీర్జా తన ఇన్‌స్టాలో పెళ్లికి సంబంధించి భావోద్వేగ పోస్ట్‌ను చేసింది. ఇది వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ తర్వాత సానియాషోయబ్‌లు విడిపోతున్నారనే వార్తలకు బలం చేకూరింది. ఇదిలావుంటే షోయబ్ తన స్నేహితురాలు సనా జావేద్‌ను పెళ్లాడడం, దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేరడం సంచలనం సృష్టించాయి.

ఖులా తీసుకుంది..
సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా
ఇదిలావుంటే షోయబ్ మాలిక్ మరో వివాహం నేపథ్యంలో సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. సానియాషోయబ్‌ల మధ్య ఇప్పటికే విడాకులు ఇప్పటికే జరిగిపోయాయని స్పష్టం చేశారు. ఇస్లాం చట్టం (షరియా) ప్రకారం సానియా ఖులా తీసుకుందని పేర్కొన్నారు. ఖులా తీసుకోవడంతో షోయబ్‌తో సానియా వివాహ బంధానికి తెరపడిందని ఇమ్రాన్ మీర్జా వివరించారు. కొంత కాలం క్రితమే సానియా భర్త షోయబ్ మాలిక్ నుంచి విడిపోవాలని నిర్ణయించిందని, అందుకే ఖులా తీసుకుందని ఇమ్రాన్ తెలిపారు. మరోవైపు షోయబ్‌కు ఇది మూడో వివాహం కావడం విశేషం. సానియా మీర్జా కంటే హైదరాబాద్‌కే చెందిన ఆసియా సిద్ధిఖిని షోయబ్ పెళ్లాడాడు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత సానియాను రెండో వివాహం చేసుకున్నాడు. తాజాగా సనా జావేద్‌ను వివాహమాడాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News