Monday, December 23, 2024

ఆనందభాష్పాలతో ఆటకు వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రొఫెషనల్ టెన్నిస్‌కు ఇప్పటికే గుడ్‌బై చెప్పేసిన భారత స్టార్ సానియామీర్జా స్టేడియంలో ఫేర్‌వెల్ మ్యాచ్‌లతో సందడి చేసింది. టెన్నిస్‌కు శ్రీకారం చుట్టిన చోటే శుభం పలికింది. ఆదివారం ఎగ్జిబిషన్ మ్యాచ్‌లతో టెన్నిస్ కెరీర్‌ను ముగించింది. సింగిల్స్ విభాగంలో రోహన్ బోపన్నతో జరిగినమ్యాచ్‌లో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం 20ఏళ్ల కెరీర్లో జరిగిన జయాపజయాలను తలుచుకుని సానియామీర్జా భావోద్వేగానికి గురైంది. మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో బోపన్నతో జత కట్టిన మీర్జా..ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్‌తో ఎగ్జిబిషన్ మ్యాచ్‌తో అలరించింది. సానియా ఫేర్‌వెల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రీడారంగానికి చెందిన ప్రముఖులతోపాటు రాజకీయనేతలు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా య్యారు.

తాను టెన్నిస్ క్రీడ ఓనమాలు నేర్చుకున్నహైదరాబాద్ గడ్డపై చివరిసారి మ్యాచ్ ఆడి రాకెట్‌కు వీడ్కోలు పలికింది. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో సానియా తన డబుల్స్ సహచరులు బెతానీ, బోపన్న, డోడిక్‌తో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడి ఆహూతులను అలరించింది. సానియా మిత్రుడైన మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ మిక్స్‌డ్ డబుల్స్ మ్యా చ్ ఆడి ఆకట్టుకున్నాడు. సానియా, ఇవాన్ జో డీకి ప్రత్యర్థి జోడీగా బెతానీతో కలిసి ఆ డాడు. సానియా ఫేర్‌వెల్ మ్యాచ్‌ల అనంతరం ఘనంగా వీడ్కోలు పలికేందుకు మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర మంత్రులు కేటిఆర్, శ్రీనివాస్‌గౌడ్, అజారుద్దీన్ తదితరులు హాజరయ్యారు. గౌరవ అతిథులుగా చైర్మన్ ఆంజనేయగౌడ్, క్రీడలు, పర్యాటక శాఖ కార్యదర్శి సుల్తానియా, ఐటి పరిశ్రమల ముఖ్య కార్యదర్శి రంజన్, సానియా తల్లిదండ్రులు మీర్జా, సీమా మీర్జా, చాముండేశ్వరినాథ్ సానియా వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా సానియా తన 20ఏళ్ల అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్లో 6గ్రాండ్‌స్లామ్స్, 43 డబ్లూటిఎ టైటిల్స్, ఆసియా క్రీడల్లో 8పతకాలు, కామన్వెల్త్ క్రీడల్లో 2పతకాలు సాధించింది. డబుల్స్‌లో 91వారాలపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగింది. భారత టెన్నిస్ రంగానికి సానియా అందించిన సేవలకు గుర్తింపుగా ఖేల్త్న్రతోపాటు, అర్జున పురస్కారం, పద్మశ్రీ, పద్మభూషణ్ పౌర పురస్కరాలు అందుకుంది. సానియా ప్రస్తుతం మహిళల ఆరంభ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మెంటార్‌గా వ్యవహరిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News