Sunday, January 19, 2025

హజ్ యాత్రకు బయలుదేరిన సానియా మీర్జా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హజ్ యాత్ర జూన్ 14 (శుక్రవారం) నుంచి ఆరంభం కాబోతున్నది. ఇండియన్ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా నేడు(ఆదివారం) తన కుటుంబ సమేతంగా హజ్ యాత్రకు బయలుదేరింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో కూడా పెట్టింది. తెలియక ఏవైనా తప్పులు చేస్తే క్షమించమని కూడా కోరింది. నా ప్రార్థనలు అల్లాహ్ స్వీకరించాలని, మంచి మార్గంలో పయనించేలా మార్గదర్శన చేయాలని కోరుకుంది.

సానియా చెల్లెలు ఆనమ్ మీర్జా కూడా ఇన్ స్టాగ్రామ్ లో హజ్ యాత్ర గురించి పోస్ట్ పెట్టింది. సానియా మీర్జా తల్లి నసీమ్ మీర్జా తమ గ్రూప్ ఫోటోను షేర్ చేసింది. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా మక్కాకు హజ్ యాత్ర చేయాలన్నది విధిగా నమ్ముతారు. అయితే మక్కా యాత్ర చేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి. పవిత్ర యాత్ర చేయగల స్తోమత ఉన్నవారే చేయాల్సి ఉంటుంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News