Friday, December 20, 2024

సానియా జోడీకి రన్నరప్

- Advertisement -
- Advertisement -

Sania Mirza- Lucie Hradecka lose in final

 

చార్లెస్‌స్టన్: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చార్లెస్‌స్టన్ ఓపెన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగంలో రన్నరప్ టైటిల్‌ను సాధించింది. చెక్ క్రీడాకారిణి లూసి హ్రాడెస్కాతో కలిసి బరిలోకి దిగిన సానియా ఫైనల్లో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అండ్రెజా క్లెపాక్ (చెక్)మగ్దా లినెట్టె(పోలండ్) చేతిలో సానియా జంట పరాజయం చవిచూసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో అండ్రెజా జోడీ 62, 46, 107 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్‌లో సానియా జంటకు ఓటమి ఎదురైంది. అయితే తర్వాతి సెట్‌లో ఇండోచెక్ జోడీ పుంజుకొంది. అద్భుత పోరాట పటిమను కనబరుస్తూ సెట్‌ను గెలుచుకొంది. ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా పోరు ఆసక్తికరంగానే సాగింది. అయితే ఈసారి చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన అండ్రెజా జోడీ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News