Friday, December 20, 2024

ముగిసిన సానియా టెన్నిస్ ప్రస్థానం..

- Advertisement -
- Advertisement -

దుబాయి: భారత స్టార్ సానియా మీర్జా టెన్నిస్ కెరీర్ ముగిసింది. సుదీర్ఘ కాలం పాటు టెన్నిస్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన హైదరాబాదీ సానియా కెరీర్‌లో చివరి టోర్నమెంట్ ఆడేసింది. దుబాయి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో అమెరికాకు చెందిన మాడిసన్ కీస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగిన సానియా మీర్జా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.

కుదుమెత్సొవా-సంసొనొవా(రష్యా) జంటతో జరిగిన పోరులో సానియా జోడీ 4-6, 0-6 తేడాతో ఓటమి పాలైంది. ఇక కెరీర్‌లో చివరి టోర్నీ ఆడిన సానియా ఓటమి అనంతరం కన్నీళ్ల పర్యంతరమైంది. సుదీర్ఘ కాలం పాటు భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన సానియా ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News