Tuesday, January 7, 2025

పెళ్లి కష్టం..విడాకులు ఇంకా కష్టం:సానియా మీర్జా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ సానియా మీర్జా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్‌స్టాలో సానియా చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. పెళ్లి కష్టం..విడాకులు ఇంకా కష్టం అని సానియా తన ఇన్‌స్టాలో కామెంట్స్‌ను పోస్ట్ చేసింది. దీంతో సానియాషోయబ్ మాలిక్‌ల విడాకుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చాలా కాలంగా సానియాషోయబ్ మాలిక్‌లు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. గతంలో కూడా వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే ఈ వార్తలను అప్పట్లో సానియా, షోయబ్‌లు కొట్టి పారేశారు. తాజాగా సానియా స్వయంగా ఇన్‌స్టాలో విడాకుల అంశంపై పెట్టిన పోస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే సానియాషోయబ్‌లు విడిపోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.

సానియా ఇన్‌స్టాలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి కష్టం..విడాకులు కూడా కష్టమే..మీరు కఠినంగా ఉంది ఎంచుకోండి. లావుగా ఉండటం కష్టం..ఫిట్‌గా ఉండటం కూడా కష్టమే.. అప్పు ఉండటం కష్టం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడమూ కష్టమే..మీరు కఠినంగా ఉంది ఎంచుకోండి. ఇతరులతో కలిసిమెలిసి మాట్లాడటం కష్టం..ఏ సమాచారం లేకుండా ఉండటమూ కష్టమే..మీరు కఠినంగా ఉంది ఎంచుకోండి. జీవితం అనేది అంత సులువేం కాదు..అది ఎప్పటికీ కష్టమే. కానీ మనం ఎప్పుడూ మన కష్టాన్నే మనం ఎంచుకోవాలని..అని రాసి ఉన్న పోస్టును సానియా తన ఇన్‌స్టా స్టోరిస్‌లో షేర్ చేసింది. ఇదిలావుంటే సానియా తన సోషల్ మీడియా ఖాతాలో భర్త షోయబ్ మాలిక్‌తో ఉన్న ఫొటోలన్నింటినీ డిలీట్ చేసింది.

ఇదే సమయంలో తాజాగా ఆమె చేసిన పోస్ట్ విడాకుల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చేలా చేసింది. మరోవైపు సానియా మీర్జా పోస్ట్‌పై సోషల్ మీడియాలో ఎవరికీ తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే సానియాషోయబ్‌లు విడిపోతారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా మరికొంత మంది ఈ వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News