Wednesday, January 22, 2025

కొడుకు కోసమే రిటైర్మెంట్ నిర్ణయం.. వివాదాలతో సహవాసం: సానియా మీర్జా ఇంటర్వ్యూ..

- Advertisement -
- Advertisement -

వివాదాలతో సహవాసం
ట్రెండ్ సెట్టర్‌ను కాను, నిబంధలకు లోబడే నడిచా
కొడుకు కోసమే రిటైర్మెంట్ నిర్ణయం
భారీ ఆశలతో సెకండ్ ఇన్నింగ్స్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా
దుబాయి: అంతర్జాతీయ కెరీర్‌లో చివరి టోర్నమెంట్ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్, తెలుగుతేజం సానియా మీర్జా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. దుబాయి ఓపెన్ టెన్నిస్ తర్వాత సానియా కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియా ఓ వార్త సంస్థకు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చింది. ఈ క్రమంలో కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంది.
ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు..

సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అవరోధాలు, మరెన్నో ఆటంకాలు దీంతో పాటు పలు అవమానాలను ఎదుర్కొన్నాను. కెరీర్ ప్రారంభం నుంచే తనను వివాదాలు చుట్టుముట్టాయి. టెన్నిస్ ఆడే సమయంలో తాను వేసుకునే డ్రెస్‌తో సహా పలు విషయాల్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొక తప్పలేదు. మతపరమైన ఒత్తిడిలను సయితం ఎదుర్కొవాల్సి వచ్చింది. ముఖ్యంగా దుస్తుల విషయంలో తనను పలు సంస్థల నుంచి ప్రతి రోజు ఎన్నో హెచ్చరికలు వచ్చేవి. తన తల్లిదండ్రులను సయితం మత సంస్థల పెద్దలు ఈ విషయంలో ఎన్నోసార్లు హెచ్చరికలు కూడా చేశారు. అయితే వారు మాత్రం ఈ బెదిరింపులను పట్టించుకోకుండా తనను మేటి క్రీడాకారిణిగా తీర్చిదిద్దడంపైనే దృష్టి పెట్టారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర వేలకట్టలేనిది. అంతేగాక మీడియాతో పాటు క్రీడా సంఘాల అండ కూడా తన ఎదుగుదలకు ప్రధాన కారణం. వీరందరికి తాను సదా రుణపడి ఉంటాను.

వాటిని పట్టించుకోలేదు..
వివాదాలు అనేది తన కెరీర్‌లో సహాజ సిద్ధంగా మారిపోయాయి. తాను ఏది చేసిన దాన్ని విపరీత కోనంలో చూసేవారు. తాను మాత్రం ఏ రోజు కూడా నిబంధలను ఉల్లంఘించలేదు. తన పరిమితుల్లో తాను ఉంటూ కెరీర్‌లో ముందుకు సాగాను. ఈ క్రమంలో ఎన్నో అవమానాలను సయితం ఎదుర్కొవాల్సి వచ్చింది. అయినా వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆటనే నమ్ముకుని ముందుకు సాగాను. అందుకే కెరీర్‌లో ఎన్నో మరుపురాని విజయాలను సొంతం చేసుకున్నాను.

దానికి పూర్తి వ్యతిరేకం..
మహిళలు క్రీడలకు దూరంగా ఉండాలని భావించే వారంటే తనకు అసలు ఇష్టం ఉండదు. క్రీడల్లో పాల్గొనకుండా మహిళలపై కొత్త మతాలు నిబంధనలు విధించడం తనను ఎందో బాధకు గురిచేస్తోంది. ఇలాంటి నిబంధనలకు తాను పూర్తి వ్యతిరేకం. ఇస్లాంలోనే కాకుండా ఇతర మతాల్లో కూడా మహిళలపై పలు విషయాల్లో ఆంక్షలు ఉన్నాయి. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్నదే తన ఆశయం. మహిళల హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థలకు తన పూర్తి సహకారం ఉంటుంది.

కొడుకు ఇజాన్ కోసమే..
కొడుకు ఇజాన్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే తాను టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను. మరి కొన్నేళ్ల పాటు కెరీర్‌లో కొనసాగే ఫిట్‌నెస్ తనకు ఉంది. ఈ విషయం ఆస్ట్రేలియా ఓపెన్‌లోనే స్పష్టమైంది. అయినా ఇజాన్ కోసం ఆటకు వీడ్కోలు పలకాలను నిర్ణయించా. కొత్త ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుందనే నమ్మకం ఉంది. ఇక భర్త షోయబ్ మాలిక్‌తో ఎలాంటి వివాదాలు లేవు. ఈ విషయంలో మీడియాలో వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. తాము ఇప్పటికీ కలిసే ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటా. దీనిలో మరో విషయానికి తావులేదని సానియా మీర్జా ఆ ఇంటర్వూలో స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News