Friday, December 20, 2024

నేడు హైదరాబాద్‌లో సానియా ఫేర్‌వెల్ మ్యాచ్‌లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌లనూ సొంత నగరం హైదరాబాద్‌లో ఆడనుంది. ఆదివారం సానియా మీర్జా రెండు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో తలపడనుంది. ఇప్పటికే అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా తనను టెన్నిస్ స్టార్ మార్చిన హైదరాబాద్ నగరంలో చివరి మ్యాచ్‌లను ఆడాలని నిర్ణయించింది. ఆదివారం ఉదయం ఎల్బీ స్టేడియంలో సానియా తొలి మ్యాచ్ ఆడనుంది. సానియా మీర్జా, రోహన్ బోపన్న జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగనుంది. సానియా టీమ్‌లో బెథాని మాటెన్, కారా బ్లాక్, మరియన్ బర్తొలిలు ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఎల్బీ స్టేడియంలో సానియాబోపన్న జట్ల మధ్య ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు.

ఈ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇక రాత్రి 7.30 గంటల నుంచి రెడ్ కార్పెట్ మ్యాచ్ జరుగనుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జరిగే ఈ మ్యాచ్‌లో సానియా మీర్జారోహన్ బోపన్న జంటగా బరిలోకి దిగనున్నారు. ఇవాన్ డొడిగ్‌బెథాని మాటెక్ జోడీతో సానియా జంట తలపడుతోంది. కాగా, తన ఫేర్‌వెల్ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలను సానియా మీర్జా శనివారం మీడియా సమావేశంలో వెల్లడించింది. సొంత గడ్డపై వీడ్కోలు మ్యాచ్ ఆడాలనే తన కల నెరవేరనుందని, దీనికి సహకరించిన సహచర క్రీడాకారులకు సానియా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. సుదీర్ఘ కాలంగా సాగిన కెరీర్‌లో ఎన్నో ఎత్తుఫల్లాలు చవిచూశానని పేర్కొంది. తన అకాడమీ ద్వారా రానున్న రోజుల్లో మెరుగైన క్రీడాకారులను తయారు చేయడమే ఏకైక లక్షంగా పెట్టుకున్నానని సానియా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News