Friday, December 20, 2024

సానియా మీర్జా కొడుకు ఐదేళ్లకే మెడల్ సాధించాడు!

- Advertisement -
- Advertisement -

తమది క్రీడాకారుల కుటుంబం అని నిరూపించాడు ఆ బుడతడు. ఐదేళ్లకే పతకం సాధించి తల్లితండ్రుల పేరు నిలబెట్టాడు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల కుమారుడి గురించే. ఈ దంపతుల ముద్దుల కుమారుడి పేరు ఐజాన్. వయసు ఐదేళ్లు. అయితేనేం? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇటీవల జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో మెడల్ సాధించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐజాన్ సాధించిన విజయానికి తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బయిపోయారు. కుమారుడితో కలసి తీసుకున్న ఫోటోలను నెట్టింట పోస్ట్ చేశారు.

షోయబ్, సానియా మీర్జాలకు 2010లో వివాహమైంది. 2018 అక్టోబర్లో వారికి ఐజాన్ పుట్టాడు. అయితే ఆ తర్వాత ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని, ఎవరికి వారు విడివిడిగా ఉంటున్నారని పుకార్లు వెల్లువెత్తాయి. తాజా సంఘటనతో ఆ పుకార్లు వట్టివేనని రుజువైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News