Thursday, January 23, 2025

షోయబ్ వివాహంపై స్పందించిన సానియా కుటుంబం

- Advertisement -
- Advertisement -

షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంపై సానియా మీర్జా కుటుంబం స్పందించింది. షోయబ్, సానియా జంట కొన్ని నెలల క్రితం విడిపోయిందనీ, మరో పెళ్లి చేసుకున్న షోయబ్ కొత్త ప్రయాణం సాఫీగా సాగాలని సానియా కోరుకుంటోందని ఆ ప్రకటనలో సానియా కుటుంబం పేర్కొంది. సానియా తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచేందుకు ఇష్టపడుతుందనీ, కానీ ఇప్పుడు షోయబ్ మరో వివాహం చేసుకోవడంతో స్పిందించవలసి వస్తోందనీ ఆ ప్రకటనలో తెలిపారు.

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య సానియా మీర్జానుంచి విడాకులు తీసుకుని, ఇటీవలే పాకిస్తాన్ కు చెందిన బుల్లితెర నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా వేరుగా ఉన్న సానియా, షోయబ్ జంట ఇటీవలే విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News