Monday, January 20, 2025

డిప్యూటీ మేయర్ అయిన పారిశుద్ధ్య కార్మికురాలు!

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లో 40ఏళ్లుగా పాకీ పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేసిన చింతా దేవి ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి గయాకు డిప్యూటీ మేయర్ అయ్యారు. గయాలో ఇదేమి కొత్త కాదు. ఇంతకు మునుపు నిమ్న జాతికి చెందిన భగవతి దేవి కూడా 1996లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ముసాహర్ సామూహానికి చెందిన ఆమె రాళ్లు కొట్టే పనిచేసేవారు. ‘పారిశుద్ధ్య కార్మికురాలు చింతా దేవి గయా డిప్యూటీ మేయర్ కావడం అన్నది చారిత్రాత్మకం’ అని గయా మేయర్ గణేశ్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు. చింతా దేవి పారిశుద్ధ్య పనేకాక కూరగాయలు అమ్మే వృత్తి కూడా చేశారు. చింతా దేవి అభ్యర్థిత్వాన్ని మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాత్సవ కూడా బలపరిచారు. ఎన్నికల్లో విజయం సాధించి ఆమె చరిత్ర సృష్టించారని శ్లాఘించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News