సూర్యాపేట: మున్సిపాలిటీ కి చెల్లించవలసిన ఇంటి పన్ను చెల్లించకపోవడం తో సూర్యాపేట్ మున్సిపాలిటీ పరిధిలోని వసుంధర షాపింగ్ మాల్ ముందు, మరియు ఎం.జి.రోడ్ నందు గల బృందవన్ రెస్టారెంట్ ముందు మున్సిపల్ బిల్ కలెక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది షాపుల ముందు నిరసన తెలుపుతూ ధర్నాకు సోమవారం ఉదయం దిగారు. ఈ విషయం గురించి అక్కడి వారు అరా తీయగా వసుంధర షాపింగ్ మాల్ వారు చెల్లించవలసిన ఇంటిపన్ను 8,45,036/-లు బకాయి, సాయి బృందావన్ గ్రాండ్ బిల్డింగ్ యజమాన్యము వారు రూ 6,96,768/- లు బకాయి ఉన్నందున నోటీసులు జారీ చేశామని, బకాయి చెల్లించమని చెప్పిన ఎలాంటి స్పందన లేదని రాలేదని అన్నారు..అందుకే నిరసన ధర్నా కు దిగామని అన్నారు.. ఇప్పటికైనా మున్సిపాలిటీకి చెల్లించవలసిన పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని, లేకపోతే రేపు అందరి ఇండ్ల వద్ద ఇదే పరిస్థితి రావచ్చని తెలిపారు.
పన్నులు చెల్లించాలని పారిశుద్ధ్య సిబ్బంది నిరసన
- Advertisement -
- Advertisement -
- Advertisement -