Friday, January 3, 2025

వేతనాల కోసం పారిశుధ్య కార్మికుల ఎదురుచూపులు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: సదాశివనగర్ మండలంలోని ఆయా గ్రామల పంచాయతీ కార్యాలయాల్లో పని చేస్తున్న పారిశుధ్య సిబ్బంది వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. సదాశివనగర్ మండలంలో పారిశుధ్య కార్మికులు ఇదివరకే నిరసన తెలుపగా శుక్రవారం భూంపల్లి గ్రామంలో జీపి సిబ్బంది పంచాయతీ కార్యాలయం వద్ద తమ నిరసన తెలిపారు. వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వేతనాల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు వేతనాలు అందే విధంగా చూడాలని సర్పంచ్ ను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News