- Advertisement -
సిద్దిపేట : 29 న బక్రీద్ పర్వదినం సందర్భంగా ఈద్గాలు, మసీదుల వద్ద శానిటేషన్ పనులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ అన్నారు. శుక్రవారం ముస్లిం తంజీమ్, మైనార్టీ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు ఏర్పాటు చేయాలని సానిటరి ఇన్స్‌పెక్టర్ సతీష్‌ను ఆదేశించారు. కుర్బానీ చేసిన అనంతరం వ్యర్ధాలను మున్సిపల్ వాహానాల ద్వారా తరలించాలని అదేశించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు రియాజుద్దిన్, తాడురి సాయి ఈశ్వర్‌గౌడ్, ప్రజాప్రతినిధులు వజీరుద్దిన్, మెయిజ్ , కో ఆప్షన్ సయిద్, తంజీమ్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -