Monday, January 20, 2025

పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

మదనపురం : గ్రామాల్లో పారిశుద్ధ పనుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తిరుపతి రావ్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం డిపిఓ సురేష్‌తో కలి సి మండలంలోని గోవింద హళ్లి, నెల్విడి, నర్సింగాపురం, కోన్నురు. ద్వారకా నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆయా పంచాయితీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్వహణ కోసం, వెచ్చిందని నిధుల రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చధనానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతు న్న నేపథ్యంలో పరిశుద్ధ పనుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. గ్రామపంచాయతీ పనుల నిర్వహణకు సంబంధించి రికార్డులను ఎప్పటికప్పుడు పొందుపర్చలన్నరు కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్‌రెడ్డి, ఎంపీడీఓ నాగేందర్, ఎంపీఓ పుష్ప, పంచాయతీ కార్యదర్శులు భార్గవి, మహేందర్ ,శ్రీనివాసులు , రాజకుమారి, తదితరుల పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News