Thursday, January 23, 2025

ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభాస్ నటించే సినిమాలో హిందీ నటుడు సంజయ్ దత్ కూడా నటించబోతున్నాడని సినీ ప్రపంచంలో టాక్. ప్రభాస్ కొత్త సినిమా ‘రాజా సాబ్’ అనే హారర్ కామెడీ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్నాడు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం అయితే లేదు. కానీ సినీ సర్కిల్ లో మాత్రం ఈ విషయం చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో సంజయ్ దత్ ఆత్మ పాత్రను పోషించబోతున్నాడని టాక్. మరో మాట ఏమిటంటే ప్రభాస్ కు తాతగా సంజయ్ దత్ ఈ సినిమాలో నటిస్తున్నాడని. ప్రస్తుతం సంజయ్ దత్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యేంత వరకు అతడు ప్రభాస్ షూటింగ్ కైతే రాబోడని అంటున్నారు.

ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ హారర్ కామెడీ సినిమా. ఇందులో ఆయన సరసన మాలవికా మోహనన్ నటిస్తోంది. ఈ సినిమాకు ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ కానున్నది. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తి చేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News