Saturday, December 21, 2024

ప్రభాస్‌కు విలన్‌గా సంజయ్‌దత్?

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇందులో ప్రభాస్‌కి జోడీగా ముగ్గురు కథానాయికలు నటిస్తారని తెలుస్తోంది. అదేవిధంగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తారని టాక్. తాత -మనవళ్లుగా రెండు పాత్రల్లోనూ ఈ పాన్ ఇండియా స్టార్ నటించనున్నారని సమాచారం.

ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. ఇందులో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ సంజయ్ దత్‌ని సంప్రదించారని తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్నారు సంజయ్. ఇప్పుడు అదే మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని అతనిని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే పేరు ప్రచారంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News