Thursday, January 23, 2025

నేడు సిట్‌కు బండి సంజయ్ గైర్హాజర్ !

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. సిట్ విచారణకు మార్చి 26న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హాజరుకారని తెలుస్తోంది. ఆదివారం జరిపే సిట్ విచారణకు వెళ్లకూడదని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. బండి సంజయ్ తరుఫున బీజేపీ లీగల్ టీం సిట్ ముందుకు హాజరు కానున్నారు. ఆదివారం కర్ణాటకలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనే కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొననున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే పేపర్ లీకేజీపై తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇస్తానని బండి సంజయ్ చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News