ముంబై: ఎడతెరిపి లేని క్రికెట్ ఆడడం వల్లే భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ ఫామ్ కోసం తంటాలు పడాల్సి వస్తుందని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు, మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఇతర ఆటగాళ్లతో పోల్చితే టీమిండియాలో భువనేశ్వర్ విశ్రాంతి లేకుండా పలు టోర్నీలు, సిరీస్‌లలో ఆడుతున్నాడన్నాడు. ఇది అతని ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నాడు. ఇలాంటి స్థితిలో భువనేశ్వర్‌కు తగినంత విశ్రాంతి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. భువనేశ్వర్ స్థానంలో షమీ లేదా ఉమేశ్ యాదవ్ వంటి సీనియర్లను ఆడిస్తే బాగుంటుందన్నాడు. ఐపిఎల్‌తో సహా వరల్డ్‌కప్, ఇతర సిరీస్‌లలో ఆడడం వల్ల భువనేశ్వర్ పూర్తిగా ఆలసిపోయాడన్నాడు. ఇప్పటికీ కూడా భారత బౌలింగ్‌కు ప్రధాన అస్త్రం భువనేశ్వర్‌నే అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. అతన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత బిసిసిఐపై ఉందన్నాడు.
Sanjay Manjrekar about Bhuvneshwar Kumar Form