Monday, January 20, 2025

కోహ్లిని దిగ్గజాలతో పోల్చలేం: సంజయ్ మంజ్రేకర్

- Advertisement -
- Advertisement -

Sanjay Manjrekar Comments on Virat Kohli

ముంబై : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆల్‌టైమ్ గ్రేట్ కెప్టెన్లతో కోహ్లిని పోల్చలేమన్నాడు. భారత అత్యుత్తమ కెప్టెన్‌లలో మహేంద్ర సింగ్ ధోనీదే అగ్రస్థానమన్నాడు. అతని సారథ్యంలో టీమిండియా మూడు ఐసిసి ట్రోఫీలు సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. ధోనీతో పోల్చితే కోహ్లి కెప్టెన్సీ ప్రమాణాలు అంతంత మాత్రమేనని స్పష్టం చేశాడు. ఒకవేళ కోహ్లి తన కెప్టెన్సీలో ఒక్కటైన ఐసిసి ట్రోఫీని అందించి ఉన్నట్టయితే తాను ఈ వ్యాఖ్యలు చేసి ఉండేవాడిని కానని మంజ్రేకర్ వివరించాడు. అయితే క్రికెటర్‌గా మాత్రం కోహ్లి భారత్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడనే విషయాన్ని మరువ కూడదన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News