Saturday, January 4, 2025

సంజయ్ రౌత్‌పై పార్టీ కార్యకర్తల దాడి

- Advertisement -
- Advertisement -

శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్‌పై ఆ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసంలో జరిగిన పార్టీ సమావేశంలో భాగంగా చర్చలు జరుగుతున్న సమయంలో ఠాక్రే మద్దతుదారులు , సంజయ్ రౌత్‌ల మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యం లో పార్టీ కార్యకర్తలు ఆయనను కొన్ని గంటల పాటు గదిలో ఉంచి తాళం వేసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆయనపై దాడి జరిగిన సమయంలో ఉద్ధవ్ ఠాక్రే అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సంఘటనకు సంబంధిత వర్గాల ప్రకారం.. ముంబైలో కొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అంచనా వేయడానికి పార్టీ హైకమాండ్ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో భాగంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ సంజయ్ రౌత్ వైఖరి, మాటల వల్ల ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ చాలా నష్టపోయిందని ఆరోపించారు. దీంతో ఆయనకు , కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అనంతరం కార్యకర్తలు సంజయ్ రౌత్‌ను దారుణంగా కొట్టి, కొన్ని గంటల పాటు ఓ గదిలో బంధించారని సమాచారం.

స్థానిక ఎన్నికల్లో యూబీటీ ఒంటరిగానే…
మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో శివసేన యూబీటీ ఒంటరిగానే పోటీ చేస్తోందని పార్టీ అధికార ప్రతినిథి ఆనంద్ దూబే పేర్కొన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుందని, మరింత ఎక్కువ మంది అభ్యర్థులను ఎన్నికల్లో నిలిపే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ విషయంపై పార్టీ హైకమాండ్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News