Wednesday, January 22, 2025

మోడీని అలా అనడం ఆయనకే అవమానకరం: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై: ‘మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫెడ్నవీస్ ప్రధాని నరేంద్ర మోడీని నవ భారత పితామహుడనడాన్ని భారతీయ జనతా పార్టీ ఆమోదిస్తోందా?’ అని శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ ఆదివారం నిలదీశారు. ఇది మోడీకే అవమానకరం, నవ భారతంలో ఆకలి, పేదరికం, నిరుద్యోగం, ఉగ్రవాద భూతాలు జడలు విరుస్తు న్నాయని ఆయన పేర్కొన్నారు. శివసేన పత్రిక ‘సామ్నా’లో ఆయన తన వీక్లి కాలమ్ ‘రోఖ్‌ఠోక్’లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

“బిజెపిలోని ఏ ఒక్కరు కూడా స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్‌ను జాతి పిత అనడంలేదు. సావర్కర్‌ను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఎల్లప్పుడూ వ్యతిరేకించింది. ఆయన కఠిన కారాగార శిక్ష కూడా అనుభవించారు. వీళ్లు భారత్‌ను నవ భారతం, ప్రాచీన భారతం అని విభజిస్తున్నారు” అంటూ రాజ్యసభ్యుడైన సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

బ్యాంకర్, గాయని అయిన అమృత ఫడ్నవీస్ ఇటీవల ఓ మాక్ కోర్ట్ ఇంటర్వూలో ‘ మనకు ఇద్దరు జాతి పితలు ఉన్నారు. నవ భారతానికి నరేంద్ర మోడీ, ప్రాచీన భారతానికి మహాత్మా గాంధీ’ అన్నారు. దీన్ని మహాత్మా గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ, ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యతిరేకించాయి. కాగా ‘స్వాతంత్య్ర సమరయోధుల బలిదానాలతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న విషయాన్ని బిజెపి గుర్తించదా?’ అని సంజయ్ రౌత్ ఆదివారం నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News