Friday, December 20, 2024

పరువు నష్టం కేసులో సంజయ్ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్‌కు ముంబై కోర్టు షాకిచ్చింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య డాక్టర్ మేధా కిరీట్ సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసును గురువారం విచారించిన ముంబైలోని స్థానిక కోర్టు సంజయ్ రౌత్‌ను దోషిగా తేల్చింది. ఇండియన్ పీనల్ కోడ్(IPC) సెక్షన్ 500 కింద సంజయ్ ని దోషిగా నిర్ధారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీవ్రీ కోర్టు)..  ఆయనకు 15 రోజుల జైలు శిక్ష విధించడంతో రూ.25,000 జరిమానా వేసింది. కాగా సోమయ్య దంపతులు నిధులు దుర్వినియోగం చేసి రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని సంజయ్ రౌత్ ఆరోపించారు. దీనిపై కిరీట్ సోమయ్య పరువునష్టం కేసు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News