Tuesday, April 1, 2025

కర్ణాటకలో 40 శాతం,మహారాష్ట్రలో 100 శాతం అవినీతి : సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై : కర్ణాటకలో 40 శాతం అవినీతి ఉంటే, మహారాష్ట్రలో ప్రస్తుత ప్రభుత్వ పాలనలో వందశాతం అవినీతి వ్యాపించి ఉందని, ఉద్ధవ్ థాక్రే నేతృత్వం లోని యుబిటి శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆదివారం విలేఖరులతో వ్యాఖ్యానించారు. శరద్ పవార్ నివాసంలో ఆదివారం మహావికాస్ అఘాడీ నాయకుల సమావేశం

తరువాత మహారాష్ట్ర ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వం అవినీతిమయమని, తప్పనిసరిగా ఓడిపోతుందని తీవ్రంగా విమర్శించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు మహా వికాస్ అఘాడీకి అనుకూలంగా వచ్చిందని ఉదహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News