Thursday, December 19, 2024

దమ్ముంటే చైనాపై సర్జికల్ దాడి చేయాలి: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా తమ భూభాగంగా పేర్కొనడంపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం)నేత సంజయ్ రౌత్ మోడీ సర్కార్‌పై మండిపడ్డారు. లడఖ్‌పై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని, కేంద్రంలోని మోడీ సర్కార్‌కు దమ్ము, ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేసి చూపించాలని సవాలు విసిరారు. లడఖ్‌లోని పాంగాంగ్ వ్యాలీలోకి చైనా ప్రవేశించిందని, అరుణాచల్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ గాఃధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సరైనవేనని అన్నారు. ఇటీవల బ్రిక్స్ సదస్సుకు హాజరైన ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిశారని, ఆ తర్వాత ఆ దేశం ఈ మ్యాప్‌ను విడుదల చేసిందని రౌత్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News