ముంబై: శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌ను పాముతో పోల్చారు మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే నితేష్ రాణె. శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి)లో సంజయ్ రౌత్ త్వరలోనే చేరుతున్నారని నితేష్ రాణె జోస్యం చెప్పారు. కేంద్ర మంత్రి, మహౠరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణె కుమారుడైన నితేష్ రాణె కంకావ్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి బిజెపి తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read: తిరుమలలో వీడియో చిత్రీకరణ… టిటిడి విచారణ
ఆదివారం నాడిక్కడ నితేష్ రాణె విలేకరులతో మాట్లాడుతూ..అతి త్వరలోనే మహారాష్ట్ర రాజకీయాలలో విస్ఫటం జరగనునన్నట్లు వెల్లడించారు. జూన్ 10వ తేదీలోగా సంజయ్ రాజారాం రౌత్ ఎన్‌సిపిలో చేరుతారని ఆయన జోస్యం చెప్పారు. పవార్ బంధువు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, నాలుసార్లు డిప్యుటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ పవార్ ఎన్‌సిపి నుంచి వైదొగలడానికి, సంజయ్ రౌత్ ప్రవేశానికి ఆయన లంకె పెట్టారు. జూన్ 10వ తేదీ ఎన్‌సిపి 25వ ఆవిర్భావ దినోత్సవం నాడే నితేష్ రాణె ఈ గడువు పెట్టడం గమనార్హం.
అజిత్ పవార్‌ను మొదటి నుంచి వ్యతిరేకించే సంజయ్ రౌత్ ఆయన(అజిత్ పవార్) పార్టీ నుంచి వౌదొలగిన తర్వాతే తాను ఎన్‌సిపిలో చేరతానని షరతు విధించినట్లు నితేష్ రాణె చెప్పారు. ఈ విషయమై తన వద్ద కొంత సమాచారం ఉందని ఆయన అన్నారు. కాగా..నితేష్ రాణె వ్యాఖ్యలపై అజిత్ పవార్ స్పందన కోరగా తనకు దీని గురించి తెలియదని సమాధానం దాటవేశారు. మాజీ మంత్రి, యువసేన అధ్యక్షుడు ఆదిత్య థాకరే స్పందన కోరినపుడు అటువంటి ప్రకటనలు చేయడానికి నితేష్ రాణెకు చెల్లింపులు జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై సంజయ్ రౌత్ సోదరుడు, శివసేన ఎమ్మెల్యే సునీల్ రౌత్ స్పందిస్తూ తన సోదరుడు సంజయ్ మొదటి నుంచి బాలాసాహెబ్ థాకరే, ఉద్ధవ్ థాకరే వెంటే ఉన్నారని, ఆయన నుంచే విధేయతను నేర్చుకోవలసి ఉంటుందని చెప్పారు.