Thursday, January 23, 2025

షిండే సర్కార్ కు సంజయ్ రౌత్ డెత్ వారెంట్..

- Advertisement -
- Advertisement -

జల్గావ్: ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయిందని, 15-20 రోజుల్లో ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు.
ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తోందని, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. షిండే ప్రభుత్వంపై డెత్ వారెంట్ జారీ అయిపోయిందని, ఇప్పుడు దానిపై ఎవరు సంతకం చేస్తారో వేచి చూడాలని రౌత్ వ్యాఖ్యానించారు.

Also Read: మహిళతో జార్ఖండ్ మంత్రి అశ్లీల సంభాషణ: బయటపెట్టిన బిజెపి ఎంపి(వైరల్ వీడియో)

కాగా.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలను మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి దీపక్ కేసర్కర్ ఎద్దేవా చేశారు. శివసేన(షిండే వర్గం)కు చెందిన కేసర్కర్ పుణెలో విలేకరులతో మాట్లాడుతూ రౌత్‌ను నకిలీ జోస్యుడిగా అభివర్ణించారు. ఇలాంటి నకిలీ జోస్యులు శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం)లో చాలామంది ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. 16 మంది శిసేన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌తోసహా అనేక సిటిషన్లపై తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టు కొంత వ్యవధి ఇవ్వాలని ఆయన అన్నారు.

గత ఏడాది జూన్‌లో షిండే, మరో 29 మంది ఎమెల్యేలు శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేసి, పార్టీలో చీలిక తెచ్చి కాంగ్రెస్, ఎన్‌సిపి, శివసేనలతో కూడిన ఎంవిఎ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత బిజెపితో పొత్తు పెట్టుకుని షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బిజెపికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్రంలో గత ఏడాది ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై ఉద్దవ్ థాక్రే, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గాలు వేసిన అనేక పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News