Thursday, January 23, 2025

సద్దుమణిగిన సావర్కర్ వివాదం: రాహుల్‌తో రౌత్ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) చల్లబడింది. బుధవారం కాంంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయిన శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) నాయకుడు, ఎంపి సంజయ్ రౌత్ అంతా సర్దుకుందని సూచనప్రాయంగా వెల్లడించారు.
మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కలసి మహారాష్ట్ర వికాస్ లఘాడి పేరిట గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే శివసేనలో చీలిక ఏర్పడిన కారణంగా ప్రభుత్వం పతనమైంది.

అయితే..ఇటీవల వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల శివసేన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కూటమిలో చీలికలు తీసుకువస్తాయని ఆయన హెచ్చరించిన నేపథ్యంలో ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ రంగంలోకి దిగారు. ప్రతిపక్షాల దృష్టి ప్రధాని నరేంద్ర మోడీపై ఉండాలే తప్ప సావర్కర్‌పై కాదని ఆయన రాహుల్‌కు హితవు పలికారు.

ఈ నేపథ్యంలో బుధవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను సమావేశమైన సంజయ్ రౌత్ వారితో అనేక ముఖ్యమైన అంశాలను చర్చించినట్లు వెల్లడించారు. ఇప్పుడు అంతా బాగుందని, ఆందోళన చెందాల్సినదేదీ లేదని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష ఐక్యత గురించి విలేకరులు ప్రశ్నించగా మహారాష్ట్రలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఐక్యంగానే ఉన్నాయని రౌత్ సమాధానమిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News