Sunday, December 22, 2024

రాజ్యసభ అభ్యర్థిగా సంజయ్ రౌత్ నామినేషన్..

- Advertisement -
- Advertisement -

ముంబై: రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం మహారాష్ట్ర నుంచి శివసేన అభ్యర్థులుగా సంజయ్ రౌత్, సంజయ్ పవార్ గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. అధికార మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) కూటమికి చెందిన నాయకుల సమక్షంలో వీరు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర శాసనసభలో వీరిద్దరూ నామినేషన్లు దాఖలు చేయగా ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నాయకుడు, మంత్రి బాలాసాహెబ్ తోరట్, ఇతర మంత్రులు హాజరయ్యారు. సంజయ్ రౌత్ వరుసగా మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. నాలుగవ పర్యాయం ఆయన పోటీ చేస్తున్నారు. కాగా, కోల్హాపూర్ జిల్లాకు శివసేన అధ్యక్షునిగా ఉన్న సంజయ్ పవార్ మొదటిసారి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో ఏర్పడిన ఆరు రాజ్యసభ ఖాళీలలో నాలుగింటిని ఎంవిఎ కూటమి గెల్చుకుంటుందని రౌత్ ధీమా వ్యక్తం చేశారు.

Sanjay Routh nomination for Rajya Sabha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News